హృతిక్‌.. 'క్రిష్ 4' విల‌న్‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 16:52

హృతిక్ రోష‌న్ సూప‌ర్ హీరోగా న‌టించిన 'క్రిష్‌'కి అభిమానులు కాని వారు ఉండ‌రు. 2006లో వ‌చ్చిన ఆ చిత్రం హిందీలోనే కాదు.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజ‌యం సాధించింది. ఇక 'క్రిష్' కంటే ముందు వ‌చ్చిన 'కోయ్ మిల్ గ‌యా' (2003).. 'క్రిష్' త‌రువాత వ‌చ్చిన 'క్రిష్ 3' (2013) కూడా మంచి విజ‌యాలే సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో భాగం రానుంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఇందులో హృతిక్ హీరో పాత్ర‌తో పాటు విల‌న్ పాత్ర‌ని కూడా త‌నే చేయ‌నున్నాడు. హృతిక్ తండ్రి రాకేష్ రోష‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అదే సంవ‌త్స‌రం క్రిస్మ‌స్‌కి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'క్రిష్‌', 'క్రిష్ 3' లో హీరోయిన్‌గా న‌టించిన ప్రియాంకా చోప్రా ఇందులోనూ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డవుతాయి. ప్రస్తుతం హృతిక్‌ ‘సూపర్‌ 30’ చిత్రంలో నటిస్తున్నాడు.

English Title
hritik.. 'krrish 4' villain

MORE FROM AUTHOR

RELATED ARTICLES