'స్పైడ‌ర్‌'.. 2500 థియేట‌ర్స్‌లో

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 19:57

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. హేరిస్ జైరాజ్ సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 2,500 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తున్న 'స్పైడ‌ర్‌'.. యుఎస్ఎలో ఇప్ప‌టికే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల అడ్వాన్స్ బుకింగ్‌ని ప్రీమియ‌ర్స్‌కే సొంతం చేసుకుంది.

English Title
'spyder' in 2500 theatres

MORE FROM AUTHOR

RELATED ARTICLES