బ్యాక్ లాగ్ క్లియర్ చేసుకుంటున్న అర్జున్ రెడ్డి!

Submitted by arun on Sat, 03/03/2018 - 07:39
vijay devarakonda

అర్జున్ రెడ్డి.. అదేనండీ. మన లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. సినిమాల్లో బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకుంటున్నాడు. మామూలుగా అయితే మనకు పరీక్షల్లో బ్యాక్ లాగ్స్ ఉంటాయి. అలాగే.. విజయ్ దేవరకొండ సినిమాల్లో బిజీ కాకముందు.. ఏం మంత్రం వేశావే అంటూ ఓ సినిమా మొదలు పెట్టాడు. 2014 నుంచి అది అలా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అంటూ లేట్ అవుతూ వచ్చి.. కొన్నాళ్లకు ఆగిపోయింది.

ఇప్పుడు విజయ్ దేవరకొండ స్టార్ డమ్ రావడంతో.. సినిమాను మళ్లీ పట్టాలెక్కించేశారు. శ్రీధర్ మర్రి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కబుర్లు.. ఇప్పుడు యూ ట్యూట్ లో కూడా ట్రెండింగ్ గా మారాయి. నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో.. సినిమా గురించి విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

ఎప్పుడో అటకెక్కిన ఈ సినిమా గురించి ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేద్దామని అనుకున్నట్టు చెప్పాడు. కానీ.. ఇప్పుడు అదే సినిమా ట్రెండింగ్ గా మారిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

English Title
My Backlogs Are Trending On YouTube – Vijay Devarakonda

MORE FROM AUTHOR

RELATED ARTICLES