బానిసగా మార్చిన భర్త: 21 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ నుంచి హైద్రాబాద్‌కు తిరిగొచ్చిన మహిళ

Submitted by arun on Fri, 03/02/2018 - 11:06
mm

భారత విదేశాంగశాఖ చొరవతో 21ఏళ్ల తర్వాత ఓ మహిళా తల్లితండ్రుల చెంతకు చేరింది. ఒమన్ దేశస్దుడినంటూ నిఖా కుదుర్చుకున్న ఓ పాకిస్దాన్‌ దేశస్తుడు బానిసను చేసి చెరలో బందించాడు. ఎట్టకేలకు విషయం కుటుంబసభ్యులకు తెలియటంతో స్వదేశానికి రప్పించారు. ఇది హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహమ్మదీ బేగం అనుభవించిన నరకం.

కట్టుకున్న వాడు చేసిన మోసంతో రెండు దశాబ్దాలు పాకిస్దాన్‌లో నరకం చూసింది మహమ్మదీ బేగం అనే మహిళ. ఇరవై ఒక్క ఏళ్ల క్రిందట ఒమన్ దేశస్దుడిగా పేర్కొన్న ఓ వ్యక్తితో నిఖా కుదిరింది. తల్లితండ్రులు కూడా ఓకే అనటంతో ఇరువురు ఒక్కటై ఒమన్ వెళ్లిపోయారు. అయితే మహమ్మదీ బేగం అక్కడికెళ్లిన అనంతరం భర్త ఓమన్ దేశస్దుడు కాదు పాకిస్దానీయుడు అని తెలిసింది. అనంతరం ఆ మహిళను పాకిస్దాన్ తీసుకెళ్లి బానిసగా మార్చి నానా చిత్రహింసలకు గురిచేశాడు. చివరకు కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని చేరవేసిన మహమ్మదీ బేగం భర్త నిర్వాకాన్ని వివరించింది. దీంతో స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేసిన కుటుంబసభ్యులు పాకిస్దాన్ లోని భారత్ హైకమీషన్ తో సంప్రదించగా స్వదేశానికి పంపేందుకు అక్కడి కమీషన్ వీసా అందించింది. అయినా భర్త అడ్డంకులు సృష్టించాడు. దీంతో విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌కి దృష్టికి తీసుకెళ్లారు. సుష్మా చొరవతో లాహోర్ నుండి డిల్లీ అక్కడి నుండి హైదరాబాద్‌కు చేరుకుంది మహమ్మదీ బేగం. 21 ఏళ్ల తర్వాత కూతురు క్షేమంగా ఇంటికి రావటంతో ఆనందం వ్యక్తం చేసిన తల్లితండ్రులు కూతురు క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

English Title
45 year old hyderabad woman return after years torture hubby in pakistan

MORE FROM AUTHOR

RELATED ARTICLES