‘శ్రీదేవిని హత్య చేశారు’

Submitted by arun on Tue, 02/27/2018 - 11:32
Subramanian Swamy

ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మరణం,  దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో బీజేపీ సీనియర్‌నేత, ప్రముఖ న్యాయవాది కూడా అయిన సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
శ్రీదేవిది కచ్చితంగా హత్యేనని స్వామి ఆరోపించారు. ఆరోజు రాత్రి హోటల్ గదిలోకి ఎవరు వెళ్లారనేది బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదు. మరి ఆమె శరీరంలో ఆల్కహాల్ ఎలా ఉందని స్వామి ప్రశ్నించారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని మొదట ఎవరూ చెప్పారని ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రీదేవికి బలవంతంగా ఎవరైనా మద్యం తాగించరా? అన్నది తేల్చాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. శ్రీదేవిని హత్య చేశారనే అనుమానం తనకు కలుగుతోందంటూ  పెను సంచలనానికి తెర తీసారు.
 

English Title
subramanian swamy responds on sridevi death

MORE FROM AUTHOR

RELATED ARTICLES