ఓవైసీకి సుబ్రమణ్యస్వామి స్ట్రాంగ్ కౌంటర్

Submitted by arun on Thu, 02/15/2018 - 12:48
asad

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కౌంటర్ ఇచ్చారు. సన్‌జ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు చేసిన దాడుల్లో మరణించిన వారిలో అధికంగా ఉన్నది ముస్లింలేనని, అలాంటిది ముస్లింల దేశభక్తిని ఎలా శంకిస్తారని అసదుద్దీన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి గట్టి కౌంటరిచ్చారు సుబ్రమణ్యస్వామి. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ‘‘ఉగ్రదాడుల్లో చనిపోయిన ముస్లిం సైనికుల సంఖ్యను అసదుద్దీన్ ఒవైసీ లెక్కపెడుతున్నారు. మరి, అదే సైనికులపై దాడి చేస్తున్న ఉగ్రవాద సంస్థల్లో ఎంత మంది ముస్లింలున్నారో కూడా అసదుద్దీన్ లెక్కపెడతారా?’’ అని ట్వీట్ చేశారు. 

English Title
swamy counters asad

MORE FROM AUTHOR

RELATED ARTICLES