విరాట్‌ కోసం మామగారి కానుక!

Submitted by arun on Fri, 02/09/2018 - 16:07
Anushka SharmaVirat Kohli

సుమారు రెండు నెలల క్రితం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌​ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనలో బిజీగా ఉండగా, అనుష్క తన సినిమా పనుల్లో హడావుడిగా ఉంది. ఇదిలా ఉంచితే, అనుష్క తండ్రి అజయ్‌ కుమార్‌.. తన అల్లుడు కోహ్లికి ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. విరాట్‌కి కవితలంటే చాలా ఇష్టం. అందుకని.. ప్రముఖ రచయిత్రి తేజశ్విని దివ్యా నాయక్‌ రచించిన ‘స్మోక్స్‌ అండ్‌ విస్కీ’ అనే పుస్తకాన్ని అజయ్‌ విరాట్‌కి కానుకగా ఇచ్చారు. గురువారం ముంబయిలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పుస్తకం ఓ కాపీని అజయ్‌.. విరాట్‌కు పంపించారు. మ్యాచ్‌ల నిమిత్తం విరాట్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. మరోపక్క అనుష్క ‘జీరో’, ‘పరి’, ‘సూయీధాగా’ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉంది.

English Title
anushka sharmas father gifts to virat kohli

MORE FROM AUTHOR

RELATED ARTICLES