జయశంకర్ సార్ చెప్పడం వల్లే అలా చేశా..

Submitted by arun on Thu, 01/25/2018 - 18:05
Vijayashanthi

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల ప్రకారం పనిచేస్తానని విజయశాంతి అన్నారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన పర్యటనను ఉద్దేశించి రాష్ట్రంలో పవనే కాదు ఎవరైనా పర్యటన చేసుకోవచ్చని చెప్పారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ను తిట్టిన పవన్‌ ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ప్రజలు గుర్తిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ చెప్పుకుంటున్నట్టుగా రాష్ట్రం బంగారు తెలంగాణగా లేదని, ఇత్తడి తెలంగాణగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో గవర్నర్ చెప్పడం కాదు..ప్రజలను అడిగితే చెబుతారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సమయమివ్వాలనే ఇన్నాళ్లు ఏం మాట్లాడలేదన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తీరు మార్చుకోవడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని వేధించడమేంటని? ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలన బాగోలేదంటే జైల్లో పెట్టేస్తారా?, అయినా కోదండరాం, మందకృష్ణను బాధపెట్టడమేంటని ప్రశ్నించారు.
 
ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్ వేరు..ఇప్పుడున్న కేసీఆర్ వేరని తేల్చిచెప్పారు. జయశంకర్ సార్ చెప్పడం వల్లే తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. కానీ 2009లో నా సీటుకే కేసీఆర్ ఎసరు పెట్టారని, తీరా అందరూ చెప్పాక కేసీఆర్ మనసు మార్చుకున్నారని ఆనాటి పరిస్థితుల్ని వివరించారు. త్వరలో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేస్తున్నానని రాములమ్మ ప్రకటించారు. ఇన్నాళ్లూ కావాలనే గ్యాప్ తీసుకున్నా..కానీ హైకమాండ్‌తో మాత్రం టచ్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, అయితే రాహుల్‌ గాంధీ తనన ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారని ఆమె చెప్పారు. ఈసారి నియోజకవర్గానికే పరిమితివ్వాలని లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. అది బస్సు యాత్రో..మరో యాత్ర తెలీదుగానీ..హైకమాండ్ చెప్పినట్లు చేస్తానని విజయశాంతి స్పష్టం చేశారు.

English Title
Vijayashanthi Questions Pawan Kalyan On KCR Regime

MORE FROM AUTHOR

RELATED ARTICLES