కొండగట్టకు బయలుదేరిన పవన్‌కల్యాణ్

Submitted by arun on Mon, 01/22/2018 - 10:47
pk

జనసేనాని పవన్‌కల్యాణ్ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. పవన్ సతీమణి అన్నా లెజ్నోవా వీర తిలకం దిద్ది, హారతిచ్చారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో పవన్ దంపతులు సర్వమత ప్రార్థనలు నిర్వించారు. హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి సాగనంపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పవన్‌ కొండగట్టుకు పయనమయ్యారు. దాదాపు 50 వాహనాల్లో వందలమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయనను అనుసరించారు. కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం ఆయన తన యాత్ర ఉద్దేశాన్ని వివరించనున్నారు.

English Title
pawankalyan yatra begins

MORE FROM AUTHOR

RELATED ARTICLES