ఒక హిందువుగా నేను అక్కడికి వెళ్ళను : సీఎం యోగి

ఒక హిందువుగా నేను అక్కడికి వెళ్ళను : సీఎం యోగి
x
Highlights

Won't Attend Mosque Inauguration: అయోధ్య రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే.

Won't Attend Mosque Inauguration: అయోధ్య రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదును కూడా నిర్మించాల్సి ఉంది. ఒకవేళ ఆ మసీదు ప్రారంభోత్సవానికి ఆహ్వానం వస్తే, ఆ కార్యక్రమానికి ఓ హిందువుగా తాను వెళ్ళను అని సీఎం యోగి తెలిపారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. నేను ఓ యోగిని, హిందువుగా తాను మసీదు ప్రారంభానికి వెళ్లనని స్పష్టం చేశారు. 'ముఖ్యమంత్రిగా మీరు నన్ను అడిగితే ఏ విశ్వాసం, మతం, కులంతో నాకు ఎలాంటి సంబంధం లేదు..ఒక యోగిగా మీరు నన్ను అడిగితే హిందువుగా మసీదు ప్రారంభానికి వెళ్లబోను..హిందువుగా నా ప్రార్ధనా పద్ధతులను అనుసరించడం నా కర్తవ్యం..అందుకు అనుగుణంగా నడుచుకుంటా'నని యోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో తాను వాదిని కాదు..ప్రతివాదినీ కాదని అంటూ తనను పిలిచినా పిలవకపోయినా తాను హాజరుకానని అసులు తనకు అలాంటి ఆహ్వానం అందబోదని ఆయన వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories