Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ వేఘ్‌వాల్‌

Women Reservation Bill Tabled In Lok Sabha By Union Law Minister Arjun Ram Meghwal
x

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ వేఘ్‌వాల్‌

Highlights

Women Reservation Bill: బిల్లు అమలులోకి వస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు . ఈ బిల్లుకు ‘‘నారీశక్తి వందన్ ’’ అనే పేరు పెట్టారు. రేపు ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చించనున్నారు. ఎల్లుండి రాజ్యసభలో బిల్లుపై చర్చించనున్నారు. కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు వల్ల ఇకపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఈ రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. ప్రస్తుత లోక్‌సభ , అసెంబ్లీలపై ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. డీలిమిటేషన్ తర్వాతనే బిల్లును అమల్లోకి తీసుకొస్తారు. మరోవైపు.. మహిళా బిల్లు కాపీలను తమకు ఎందుకు ఇవ్వలేదంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories