Haryana: హర్యానాలో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన మహిళ

Woman Slaps JJP MLA Visiting Haryana Flood Affected Areas
x

Haryana: హర్యానాలో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన మహిళ

Highlights

Haryana: ప్రజలను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై ఆగ్రహం

Haryana: హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇటీవల కురిసిన వర్షాలకు ఘగ్గర్ నదిపై ఉన్న డ్యామ్‌ దెబ్బతినడంతో ఘులా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. అయితే అక్కడి ప్రజలు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను చూట్టుముట్టారు. తమ దీనస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఓ మహిళ అకస్మాత్తుగా అక్కడకు వచ్చి.. ఇప్పుడెందుకు వచ్చావ్ అంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంప చెళ్లుమనిపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలిచారు. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ స్పందించారు. మహిళపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోనని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories