అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో వొడాఫోన్‌కు భారీ ఊరట

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో వొడాఫోన్‌కు భారీ ఊరట
x
Highlights

హేగ్ లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ లో యుకె టెలికాం మేజర్ వోడాఫోన్ గ్రూప్ పిఎల్‌సికి శుక్రవారం భారీ ఊరట లభించింది. రూ. 20 వేల కోట్ల పన్ను వివిధ కేసులో...

హేగ్ లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ లో యుకె టెలికాం మేజర్ వోడాఫోన్ గ్రూప్ పిఎల్‌సికి శుక్రవారం భారీ ఊరట లభించింది. రూ. 20 వేల కోట్ల పన్ను వివిధ కేసులో హేగ్ ఆర్బిట్రేషన్ వోడాఫోన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వోడాఫోన్‌పై భారత ప్రభుత్వం పన్ను బాధ్యత విధించడం భారత్‌, నెదర్లాండ్స్‌ మధ్య పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చిందని వోడాఫోన్ తెలిపింది. ఈ తీర్పుతో బకాయిలు రూ 12,000 కోట్లతో పాటు, రూ 7900 కోట్ల పెనాల్టీల చెల్లింపుపై అంతర్జాతీయ న్యాయస్ధానంలో ఉపశమనం లభించిందని పేర్కొంది.

కాగా వాయుతరంగాల వాడకం, లైసెన్స్‌ ఫీజులకు సంబంధించి తలెత్తిన వివాదంపై వొడాఫోన్‌ 2016లో సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో ఆర్బిట్రేషన్‌ అనుకూల తీర్పు రావడంతో ఆ కంపెనీకి భారీ ఊరట లభించినట్లయింది. ఇదిలావుంటే ప్రభుత్వ బకాయిలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మొబైల్ క్యారియర్‌లకు 10 సంవత్సరాల సమయం ఇవ్వడంతో భారీగా రుణపడి ఉన్న ఈ టెలికాం సంస్థ ఈ నెల ప్రారంభంలో కొంత ఉపశమనం పొందింన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories