Supreme Court: సుప్రీంకోర్టులో అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

Unprecedented Historical Event Unveiled In The Supreme Court
x

నేడు సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం (ఫైల్ ఇమేజ్)

Highlights

* ఒకేసారి 9మంది న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం *ఇంత మంది జడ్జీలు ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి

Supreme Court: సుప్రీంకోర్టులో మరికాసేపట్లో అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒక్కరోజే తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇంతకు ముందెప్పుడూ సుప్రీం చరిత్రలో ఇంత మంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణస్వీకారం చేసిన దా ఖలాలు లేవు. ఈ అపూర్వ వేడుకకు సుప్రీంకోర్టు అదనపు భవన ఆవరణంలోని ఆడిటోరియం వేదిక కానుంది. వీరితో సీజేఐ ఎన్‌వీ రమణ ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కొత్త జడ్జిలు బాధ్యతలు స్వీకరించడంతో సుప్రీంలో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య సిజెఐతో కలిపితే 33కు చేరుతుంది.

ఈ ఆపూర్వ ఘట్టాన్ని దేశ ప్రజలందరూ తిలకించాలనే ఉద్దేశంతో ఫస్ట్‌ టైం జడ్జీల ప్రమాణస్వీకార మహోత్సవాన్ని లైవ్‌ ద్వారా టెలీకాస్ట్‌ చేయనున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పిఎస్ నరసింహ ప్రమాణస్వీకారం చేయనున్నారు.చివరిగా 2019 సెప్టెంబరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగింది. రెండేళ్ల విరామం తర్వాత కొత్త జడ్జీలు రానున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. అయితే, పదవీ విరమణలతో ప్రస్తుతం 24 మందే ఉన్నారు. తాజాగా నియమితులైన 9 మందితో కలిపి వీరి సంఖ్య 33కు చేరనుంది. ఒక ఖాళీ మాత్రమే ఉంటుంది. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకాలు జరగడం, వారిలో ముగ్గురు మహిళా జడ్జీలు ఉండడంతో అందరూ విశేషంగా భావిస్తున్నారు.

కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన 9 మంది కొత్త న్యాయమూర్తుల పేర్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఆ నియామకాలను ఖరారు చేస్తూ గురువారం సాయంత్రం కేంద్ర న్యాయ శాఖ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ కొత్త న్యాయమూర్తులతో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త జడ్జీలలో నలుగురు వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు.కొత్త న్యాయమూర్తుల్లో ముగ్గురు పదవీ విరమణలోపు సీజేఐలుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌కు సీనియారిటీ ప్రకారం 2027 ఫిబ్రవరిలో సీజేఐ బాధ్యతలు చేపట్టే అవకాశం రావచ్చు. ఆయన పదవీ విరమణ తర్వాత జస్టిస్‌ నాగరత్న సీజేఐ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే భారత ప్రధాన న్యాయమూర్తి హోదాను చేపట్టే తొలి మహిళ ఆమె రికార్డు సృష్టిస్తారు. అయితే, 2027 సెప్టెంబరు నుంచి ఒక నెలరోజులపాటు ఆమె ఆ పదవిలో ఉంటారు. ఇటు సీనియర్‌ న్యాయవాది పి.ఎస్‌.నరసింహ కూడా జస్టిస్‌ నాగరత్న తర్వాత సీజేఐ అయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ హిమా కోహ్లికి రేపటికి 62 ఏళ్లు పూర్తవుతాయి. హైకోర్టుల్లో జడ్జీల వయో పరిమితి 62 ఏళ్ల వరకే ఉంటుంది. అంటే ఇప్పుడామే హైకోర్టు జడ్జీగా రిటైర్డ్‌ అయ్యే ఒక్కరోజు ముందు సుప్రీంకోర్టు జడ్జీగా వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో 65 ఏళ్ల వరకూ జడ్జీ హోదాలో కొనసాగే అవకాశముంది. దీంతో ఆమె ఇప్పుడు మరో మూడేళ్లు న్యాయసేవలు అందించనున్నారు.భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు 8మంది మహిళలు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కొత్తగా ప్రమాణం చేయనున్న ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో ఆ సంఖ్య 11కు చేరనుంది. ప్రస్తుతం జస్టిస్‌ ఇందిరా బెనర్జి ఒక్కరే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories