Unlock 3 Guidelines: అన్నీ తెరిచేయొచ్చు..షరతులు వర్తిస్తాయి!

Unlock 3 Guidelines: అన్నీ తెరిచేయొచ్చు..షరతులు వర్తిస్తాయి!
x
UNLOCK 3
Highlights

Unlock 3 Guidelines: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Unlock 3 Guidelines: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్‌లాక్‌ 2.0 గడువు ముగియనుండటంతో.. కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్‌లాక్‌ 3.0లో రాత్రిపూట ఉన్న కర్ఫ్యూను పూర్తిగా తొలగించారు.

మార్గదర్శకాలు..

- ఆగస్ట్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతుంది.

- ఆగస్ట్ 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్ ఉండాల్సిందే.

- ప్రజలు రాత్రి పూట బయట తిరగవచ్చు. రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత. అయితే, కరోనా నిబంధనలు పాటించాలి.

- ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లు ఓపెన్ చేయవచ్చు.

- వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి.

- కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన జోన్లలో మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ధియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు తెరవవచ్చు.

- కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన జోన్లలో సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories