Viral Video: నెట్టింట వైరల్ గా మారిన పాన్ దోశ.. భూమిని వదిలేసే టైం వచ్చేసింది..

Viral Video: నెట్టింట వైరల్ గా మారిన పాన్ దోశ.. భూమిని వదిలేసే టైం వచ్చేసింది..
x

Viral Video: నెట్టింట వైరల్ గా మారిన పాన్ దోశ

Highlights

సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు వైరల్ అయినా ఫుడ్ కి సంబంధించిన వీడియోలకు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నిత్యం చిత్రవిచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్ తో కూడిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video: సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు వైరల్ అయినా ఫుడ్ కి సంబంధించిన వీడియోలకు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నిత్యం చిత్రవిచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్ తో కూడిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని రెసిపీ వీడియోలు నెటిజన్స్ ను ఆకట్టకుంటే మరికొన్ని కాంబినేషన్లు అవాక్కయ్యేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సౌత్ ఇండియాలో అందరికీ తెలిసిన బ్రేక్ ఫాస్ట్ దోశ. మసాలా దోశ, రవ్వ దోశ, ఓట్స్ దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ఉప్మా దోశ, పెసర దోశ, రాగి దోశ ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో వెరైటీ దోశలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ఓ వ్యక్తి పాన్ దోశను తయారు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

తమలపాకుతో తయారు చేసిన ఆకుపచ్చని పిండిని పెనంపై వేసి దానికి వెన్నను జోడించి దోరగా కాల్చాడు. అనంతరం కట్ చేసిన పాన్, కిస్ మిస్, ఆప్రికాట్స్, డేట్స్, టూటీఫ్రూటీ, డ్రైఫ్రూట్స్, పాన్ సిరప్ వేశాడు. ఈ వైరెటీ దోశ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ లభించాయి. వీడియోకి తగ్గటే నెటిజన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. పాన్ దోశ: ఈ లోకాన్ని విడిచే సమయం దగ్గరపడిందని ఓ వ్యక్తి కామెంట్ చేస్తే, మరొకరు మయనీస్ దోశ, కెచప్ పాన్ గురించి ఎదురు చూస్తున్నామని చమత్కరించారు. ఇది పాన్ దోశనా రేడియో యాక్టివ్ దోశనా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories