Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీంకోర్టులో నేడే తీర్పు

Supreme Court Verdict on Electoral Bonds Today
x

Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీంకోర్టులో నేడే తీర్పు 

Highlights

Supreme Court: పార్టీలకు విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్రం పథకం

Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీంకోర్టులో నేడు తీర్పు వెలువడనుంది. రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది నవంబర్‌ 2న ఈ అంశంపై తీర్పును రిజర్వ్‌ చేసింది.

రాజకీయ పార్టీలు విరాళాల పేరుతో అక్రమ సొమ్మను పోగుచేస్తున్నాయన్న ఆరోపణలనకు చెక్ పెట్టేందుకు కేంద్రం 2018 జనవరి 2న ఈ పథకాన్ని నోటిఫై చేసింది. బాండ్స్ ప్రవేశపెట్టడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం అక్రమ డబ్బును బహిర్గతం చేయటమని.. ఆ నిధుల్లో పారదర్శకత కోసం మాత్రమేనని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories