కాంగ్రెస్ పార్టీకి ఝలక్.. ఇక ఆ పొత్తు లేదు..

కాంగ్రెస్ పార్టీకి ఝలక్.. ఇక ఆ పొత్తు లేదు..
x
Highlights

దేశ రాజకీయాల్లో సరికొత్త పరిణాం చోటుచేసుకుంది. కొంతకాలంగా యూపీలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే....

దేశ రాజకీయాల్లో సరికొత్త పరిణాం చోటుచేసుకుంది. కొంతకాలంగా యూపీలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టితో ఆ చర్చలు కొలిక్కి వచ్చాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసిపోటీచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల అధినేతలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పైగా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదని అన్నారు. యూపీలోని మొత్తం

80 సీట్లలో చెరి 40 సీట్లలో పోటీచేస్తామని మాయావతి, అఖిలేష్ యాదవ్ చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకు కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగలేదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బిఎస్పీ లు మాత్రమే పోటీచేస్తాయన్నారు. బలం లేని కాంగ్రెస్ పార్టీని తమతో కలుపుకోవడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని వారు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories