Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్

Rameshwaram Cafe Bomb Blast Case Updates
x

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్

Highlights

Rameshwaram Cafe: పశ్చిమ బెంగాల్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్న NIA

Rameshwaram Cafe: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో బాంబు కేసులో ఎన్‌ఐఏ కీలక పురోగతి సాధించింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. రామేశ్వరం కేఫ్‌లో బాంబు అమర్చిన నిందితుడు, ఉగ్రవాది షాజిబ్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ. నిశితంగా దర్యాప్తుతో పాటు నిఘా తర్వాత ఎన్‌ఐఏ అతడిని అరెస్ట్‌ చేసి ఈ కేసులో విజయం సాధించింది. చాలా నెలలుగా పరారీలో ఉన్న ఉగ్రవాదిని హుస్సేన్‌ను పట్టుకుంది. పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

మార్చి 1న బెంగళూర్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, అప్పటి నుంచి నిందితుడిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ బెంగళూర్ క్రైం ఇన్వెస్టిగేషన్ టీం వెతుకుతూనే ఉన్నాయి. నిందితులను పట్టించిన వారికి రివార్డు కూడా ప్రకటించాయి. ఎట్టకేలకు బాంబు అమర్చిన నిందితుడిని ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories