వారికి 5 శాతం రిజర్వేషన్లకు ఆమోదం

వారికి 5 శాతం రిజర్వేషన్లకు ఆమోదం
x
Highlights

రాజస్థాన్ లో కొంతకాలంగా గుజ్జర్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్నారు. వారి ఉద్యమాల ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది....

రాజస్థాన్ లో కొంతకాలంగా గుజ్జర్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్నారు. వారి ఉద్యమాల ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్య, ఉద్యోగాల్లో ఈ 5శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర మంత్రి కల్లా బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ రిజర్వేషన్లు గుజ్జర్లతో పాటు గడియా లోహార్‌లు, బంజారాలు, , గడరియా, రైకస్కులాలకు వర్తింపుకానుంది.

మరోవైపు అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో ప్రస్తుతం బీసీలకు ఉన్న 21శాతం రిజర్వేషన్లు 26శాతానికి చేరాయి. అయితే… ప్రస్తుత పెంపు ఇతర రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం చూపదని రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. గత వారం రోజులుగా గుజ్జర్ల రిజర్వేషన్ ఉద్యమనేత కిరోరి సింగ్‌ భైంస్లా, ఆయన మద్దతుదారులు రిజర్వేషన్ల కోసం ఆందోళనకు దిగారు. సవాయ్ మాధోపూర్‌ జిల్లాలో రైలు పట్టాలపై బైఠాయించారు. వీరి ఆందోళన ఆదివారం హింసాత్మకంగా మారింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories