10 గంటల ఆలస్యానికి రూ.22 వేల జరిమానా.. ఖంగుతిన్న రైల్వే అధికారులు..

Punjab Consumer Court Orders Passenger to Pay Rs 22,000 for Train 10 Hours Late
x

10 గంటల ఆలస్యానికి రూ.22 వేల జరిమానా(ఫైల్ ఫోటో)

Highlights

* ప్రయాణికుడికి రూ.20వేలు పరిహారం, రూ.2వేలు లిటిగేషన్ ఖర్చు

Indian Railway: రైలు 10 గంటలు ఆలస్యంగా వచ్చినందుకు నరకయాతన అనుభవించిన ప్రయాణికుడికి రూ.22 వేలు పరిహారం చెల్లించాలని పంజాబ్ వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ సంఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి. అమృత్సర్ కు చెందిన సుజీందర్ సింగ్ అనే వ్యక్తి 1 ఆగస్టు 2018,న అమృత్సర్ నుంచి న్యూఢిల్లీకి, తిరిగి ఆగస్ట్ 3, 2018న న్యూఢిల్లీ నుంచి అమృత్సర్ కు రెండు ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.

హిరాకుడ్ ఎక్స్ప్రెస్ అమృత్సర్ నుంచి విశాఖపట్నం రైలు రాత్రి 11.45 బయలుదేరాల్సి ఉంది. తాను రాత్రి 11 గంటలకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్లు తెలిపారు. అయితే రైల్వే అధికారులు ఒక్కసారిగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బయలుదేరే సమయాన్ని 1.30 గంటలకు మార్చారు. తర్వాత మళ్లీ తెల్లవారుజామున 2.30కి మార్చారు.

మెడికల్ చెకప్ కోసం ఎయిమ్స్‌కి వెళ్లాల్సిన ఫిర్యాదుదారు తనకు ఛాతీలో ఇన్ఫెక్షన్, శ్వాస ఆడకపోవడం, షుగర్, లోబీపీ, ఉన్నట్లు సుజీందర్ సింగ్ వాదించారు. అతను ఇద్దరు వ్యక్తుల సహాయంతో ప్లాట్ఫారమ్ నుంచి ప్లాట్ఫారమ్కు వెళ్లవలసి వచ్చింది. రాత్రి 11 గంటలకు రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆయన ఉదయం 10.30 గంటలకు అమృత్సర్ రైల్వే స్టేషన్లోనే ఉన్నారు.

రైలు మధ్యాహ్నం 1.15 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకుందని అప్పటికే ఓపిడి సమయం దాటిపోయిందని వాదించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుందని చెప్పారు. రైలు ఆలస్యంగా రావడంతో అతనికి మెడికల్ చెకప్ చేయలేకపోయారు. ఇది రైల్వే సేవలో లోపం రైలు ఆలస్యానికి తాను చిత్రహింసలకు గురయ్యానని వాదించారు.

ఈ విషయంపై ఆయన అతను డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ఫిరోజ్పూర్, స్టేషన్ మాస్టర్, ఉత్తర రైల్వే, అమృత్సర్ కి వ్యతిరేకంగా అమృత్సర్ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు సదరు ప్రయాణికుడికి రూ.20వేలు పరిహారం, రూ.2వేలు లిటిగేషన్ ఖర్చుగా చెల్లించాలని సంబంధిత రైల్వే అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories