నేడు విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య రెండో వందే భారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Prime Minister Modi will virtually inaugurate the second Vande Bharat train between Visakha and Secunderabad today
x

నేడు విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య రెండో వందే భారత్‌ రైలును.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Highlights

PM Modi: దేశ వ్యాప్తంగా రూ.85 వేల కోట్ల విలువైన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM Modi: ఇవాళ ప్రధాని మోడీ పలు రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దేశ వ్యాప్తంగా రూ.85వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి మరో వందే భారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. వర్చువల్‌గా ప్రధాని మోడీ ఈ రైలును ప్రారంభిస్తారు. రేపటి నుంచి వందేభారత్‌ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. తెలంగాణలో మొదలయ్యే ఈ భారత్‌ శ్రేణిలో ఇది నాలుగవది. అయితే, ఇప్పటికే ఈ రెండు స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతుంది. ప్రయాణికుల డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మార్గంలో మరో వందే భారత్ రైలును ప్రవేశ పెట్టారు. ఈ రైలులో ఏడు ఏసీ ఛైర్ కోచ్‌లతో పాటు ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఉంటాయి. ఈ రైలులో దాదాపు 530 మంది ప్రయాణం చేయొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories