కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
x
Highlights

గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి దాదాపు 100 రోజులుగా కరోనాతో పోరాడారు. అయితే ఆసుపత్రిలో 100 రోజుల..

గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి దాదాపు 100 రోజులుగా కరోనాతో పోరాడారు. అయితే ఆసుపత్రిలో 100 రోజుల చికిత్స తర్వాత, చివరికి భరత్ సింగ్ సోలంకి డిశ్చార్జ్ అయ్యారు. జూన్ నెలలో భరత్ సింగ్ సోలంకి కరోనా భారిన పడ్డారు.. అప్పటినుంచి ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నారు.. చివరికి దానిని అధిగమించారు. అయితే ఇంత సుదీర్ఘకాలం చికిత్స పొందిన కరోనా పేషంట్ గా భరత్ సింగ్ సోలంకి వార్తల్లో నిలిచారు. చికిత్స అనంతరం భరత్ సింగ్ సోలంకి డిశ్చార్జ్ అయిన తరువాత, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను విష్ చేశారు.

నరేంద్ర మోడీ స్వయంగా భరత్ సింగ్ సోలంకితో మాట్లాడినట్టు ట్వీట్ చేశారు. ట్వీట్ లో నరేంద్ర మోడీ ఇలా పేర్కొన్నారు.. 'కరోనాతో జరిగిన 100 రోజుల యుద్ధంలో ఆయన గొప్ప ధైర్యాన్ని చూపించాడు.. వారి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు. కాగా డిశ్చార్జ్ అయి బయటకు వెళ్ళేటప్పుడు విలేకరులతో మాట్లాడిన భరత్ సింగ్ సోలంకి.. ఈ సందర్బంగా ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories