Agni-5: శత్రుభయంకర అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం... గర్విస్తున్నామన్న ప్రధాని మోదీ

PM Modi Is Proud Of The Successful Launch Of The Dreaded Agni-5 Missile
x

Agni-5: శత్రుభయంకర అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం... గర్విస్తున్నామన్న ప్రధాని మోదీ

Highlights

Agni-5: డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు

Agni-5: భారత్ రక్షణ రంగ చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణిని పూర్తి దేశీయంగా అభివృద్ధి చేశారు. దీన్ని మొదటిసారిగా గాల్లోకి పంపగా, అంచనాలను అందుకుంటూ డీఆర్డీవో శాస్త్రవేత్తలను ఆనందోత్సాహాలకు గురిచేసింది. ఈ ప్రాజెక్టుకు మిషన్ దివ్యాస్త్రగా నామకరణం చేశారు. అగ్ని-5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్- MIRV టెక్నాలజీ వినియోగించారు. MIRV టెక్నాలజీతో రూపొందించిన క్షిపణిని ఒక్కసారి ప్రయోగించాక... అందులోని వార్ హెడ్ పలు విభాగాలుగా విడిపోయి, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని మోడీ... DRDO సైంటిస్టులను అభినందించారు. DRDO శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర పట్ల గర్విస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories