హెల్త్ ఇన్సూరెన్స్.. కరోనా తీసుకొచ్చిన చైతన్యం!

హెల్త్ ఇన్సూరెన్స్.. కరోనా తీసుకొచ్చిన చైతన్యం!
x
Highlights

ఒకప్పుడు ఇన్స్ రెన్స్, పాలసీలు చేసుకోవాలంటూ ఏజెంట్లు ఇళ్ల చుట్టూ తిరిగేవారు. ఫోన్లు చేసి విసిగించేవాళ్లు. కనిపించినప్పుడల్లా మీరు పోతే ఎలా అంటూ క్లాస్...

ఒకప్పుడు ఇన్స్ రెన్స్, పాలసీలు చేసుకోవాలంటూ ఏజెంట్లు ఇళ్ల చుట్టూ తిరిగేవారు. ఫోన్లు చేసి విసిగించేవాళ్లు. కనిపించినప్పుడల్లా మీరు పోతే ఎలా అంటూ క్లాస్ పీకేవాళ్లు కరోనా పుణ్యమా అని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జనాలే ఇన్స్ రెన్స్ తీసుకుంటామంటూ ఆఫీసుల ఎదుట క్యూ కడుతున్నారు. ఒకటి కాదు రెండు పాలసీలైన పర్వాలేదంటూ అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. మరీ ప్రజల్లో అంతటిచైతన్యం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థ మీద కోలుకోని దెబ్బతీసినా ప్రజల్లో చైతన్యవంతమైన ఆలోచనను తీసుకువచ్చింది. కరోనా దేశంలోకి ఎంటర్ కాగానే జనాలకు ప్రాణభయం పట్టుకుంది. బతికితే చాలురా నాయనా అనే స్థితికి వచ్చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు నిల్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు ఫుల్ ఇక చేసేదేమి లేక ప్రజలు హెల్త్ ఇన్స్ రెన్స్ లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో అడుగుపెడితే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంత డబ్బు పెట్టే స్థోమత లేక, ప్రాణం మీద ఉన్న భయంతో అందరు ఇన్స్ రెన్స్ కంపెనీల మెట్లు ఎక్కుతున్నారు. ప్రస్తుతం కరోనా ఇన్స్ రెన్స్ , సీజనల్ వ్యాధులకు సంబంధించిన స్పెషల్ ఇన్స్ రెన్స్ లంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి.

42 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న వారు టర్మ్ ఇన్సూరె న్స్‌‌లను తీసుకుంటున్నారు. అంటే 77 శాతం మంది టర్మ్ ఇన్సూరెన్స్‌‌లను కొన్నారు. పాలసీల కొనుగోళ్లలో 31 నుంచి 35ఏళ్ల వారు 30శాతం షేర్ తో ఫస్ట్ ప్లేస్‌‌లో ఉన్నారు. హై నెట్‌ వర్త్‌‌ ఇండివిడ్యువల్ సెగ్మెంట్‌ లో 80 శాతం మందికి పైగా కస్టమర్లు కోటి రూపాయలు, ఆపై ఎక్కువ కవర్‌‌‌‌ను తీసుకున్నారు. వారిలో 25 శాతం మంది 2 కోట్ల నుంచి 5 కోట్ల కవర్‌‌‌‌ను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ప్రభుత్వం 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. అప్పటి నుంచి ప్రజల్లో కూడా ఇన్స్ రెన్స్ లపై దృష్టి సారించారు. ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలతో ముందుకు రావాల్సిన అవసరం ఎత్తైన ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories