CEC Bill: ‘సీఈసీ, ఈసీ’ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Parliament Gives Nod To Bill On Appointment Service Conditions Of Cec Ecs
x

CEC Bill: ‘సీఈసీ, ఈసీ’ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Highlights

CEC Bill: CEC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం

CEC Bill: ఎన్నిక‌ల సంఘం అధికారుల నియామ‌కంపై కొత్త బిల్లు లోక్‌స‌భ‌ ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం నూత‌న చీఫ్ ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌, ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్లను నియ‌మించ‌నున్నారు. అయితే ఎన్నిక‌ల అధికారుల బిల్లుకు రాజ్యస‌భ గ‌తంలోనే ఆమోదం వ్యక్తం చేసింది. ఎన్నిక‌ల అధికారుల నియామ‌కం, స‌ర్వీస్ ప‌రిమితులు, ఆఫీసు కాల ప‌రిమితి గురించి కొత్త బిల్లులో పొందుప‌రిచారు. అయితే ఎల‌క్షన్ ఆఫీస‌ర్ల నియామ‌కంపై పార్లమెంట్‌లో బిల్లు క్లియ‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఆ బిల్లు రాష్ట్రప‌తి ఆమోదం కోసం వెళ్లనుంది.

బిల్లు గురించి లోక్‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. న్యాయ‌శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిపై మాట్లాడారు. 1991లో రూపొందించిన ఎన్నిక‌ల అధికారుల నియామ‌కం బిల్లు అస్పష్టంగా ఉంద‌ని, ఆ బిల్లులోని లోపాల‌ను తాజా బిల్లులో పూర్తి చేసిన‌ట్లు చెప్పారు. మూజ‌వాణి ఓటు ద్వారా తాజా బిల్లును ఆమోదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories