రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సెషన్స్

Parliament Budget Meetings from Tomorrow
x

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సెషన్స్

Highlights

ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి

Parliament Budget Meeting: రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. కాగా ఫిబ్రవరి 9 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చింది. ఈ భేటీలో సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది.

ఇక లోక్‌సభ చివరి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా 17వ లోక్‌సభ గడువు జూన్‌ 16న ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవే చివరి పార్లమెంట్‌ సమావేశాలు కానున్నాయి. దీంతో కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పైనే ఎక్కువ నజర్ పెడుతున్నట్లు టాక్. ఏప్రిల్‌ నుంచి మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories