Sthapathi Anandachari: స్థపతి ఆనందాచారికి పద్మశ్రీ..

Padma Shri to Sthapathi Anandachari
x

Sthapathi Anandachari: స్థపతి ఆనందాచారికి పద్మశ్రీ..

Highlights

Sthapathi Anandachari: ఆనందాచారి పర్యవేక్షణలో అనేక దేవాలయాల నిర్మాణం

Sthapathi Anandachari: కూలీగా జీవితం ప్రారంభించారు. తర్వాత పట్టుదలతో ప్రభుత్వం ఉద్యోగం సాధించారు. ఇప్పుడు పద్మశ్రీ సాధించారు. ఇదేదో సినిమా స్టోరీ కాదు ఓ వ్యక్తి నిజ జీవితం. అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుని కైవసం చేసుకున్నారు. ఆయనే స్థపతి ఆనందచారి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల లిస్ట్ లో హైదరాబాద్ కు చెందిన ఆనందచారి పేరు కూడా ఉంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన చారి 1972లో టీటీడీకి చెందిన శిల్ప కళాశాలలో చేరారు. నాలుగు సంవత్సరాల పాటు శిల్పకళను అభ్యసించారు. తరువాత దేవాదాయశాఖ శిల్ప కళాశాలలో అధ్యాపకుడిగా చేశారు. 80లో దేవాదాయ శాఖలో సహాయ స్థపతిగా స్థిరపడ్డారు.

గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, విజయవాడ అన్నవరం, కాణిపాకం, శ్రీకాళహస్తి, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, ఆలయాల్లో పనిచేశారు.. 2009 లో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన స్థపతిగా పదోన్నతి పొందారు.

ఆనందాచారి అనేక అవార్డులు పొందారు. 2002, 2008లో శిల్ప కళ విభాగంలో ఉగాది పురస్కారం అందుకున్నారు. 2013లో కళా రత్న పురస్కారం అందుకున్నారు. దాదాపు 150 అవార్డులు ఆయనను వరించాయి. లిమ్కా బుక్, ఆఫ్ రికార్డ్స్ , గ్లోబల్ ఇండియా, ఆర్ హెచ్ ఆర్ యూనిక్ తెలుగు బుక్ రికార్డు, వండర్బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా అనేక రికార్డులకెక్కారు.

11 సార్లు పద్మశ్రీ అవార్డుకు నామినేషన్‌కు ఆయన పంపించారు. ఆయన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ఆయన పద్మశ్రీని సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు ఆనందచారి.

Show Full Article
Print Article
Next Story
More Stories