కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్

కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్
x
Highlights

కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకింది లేనిది లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ...

కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకింది లేనిది లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాపిస్తుంది అనే నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో సైంటిస్టులు, డాక్టర్లు షాక్ అయ్యారు. ఆందోళనలో పడిపోయారు.

కరోనా వైరస్ సోకిందా లేదా అని కొన్ని లక్షణాల వల్ల తెలుసుకోవచ్చు. వైరస్ సోకగానే ముందుగా జలుబు ఆ తర్వాత తుమ్మడం, దగ్గడం, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఇక్కడితో ఆగకుండా ఊపిరితిత్తుల వరకూ చేరి న్యూమోనియాకి దారి తీస్తుంది. అలా కరోనా ఇప్పటి వరకు వైరస్‌ లక్షణాలు 14 రోజుల్లో బయటపడేవి. కానీ ఇప్పుడు వైరస్‌ లక్షణాలు బయటపడే సమయం పెరిగినట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధార‌ణంగా అయితే శ‌రీరంలో ఈ వైర‌స్ ఉంటే 14 రోజుల్లో ఇన్ఫెక్షన్‌ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డాలి. కానీ కొంద‌రిలో మాత్రం 26-28 రోజుల త‌ర్వాత గానీ వైర‌స్ లక్ష‌ణాలు క‌నిపించ‌డం లేదట. విదేశాల నుంచి రాష్ర్టానికి తిరిగివ‌చ్చిన కొంతమందికి క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిపగా వారిలో కొంద‌రికి ఎలాంటి వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ 28 రోజుల ‌త‌ర్వాత వారిలో చాలామందికి పాజిటివ్ అని తేలడం షాక్‌కు గురిచేస్తోంది.

వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి స్థిరపడి వ్యాపించడానికి పట్టే సమయం పెరగడంతో వైద్యులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీని వల్ల లక్షణాలు కనబడకున్నా కేసులు పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. వైరస్‌ సోకిన వారిలో 70 శాతం మందికి 10 నుంచి 18 రోజుల తర్వాతే లక్షణాలు కనబడుతున్నాయని కొందరు పేషెంట్లలో 17,22,31,35 రోజుల తర్వాత కూడా లక్షణాలు బయటపడటం కలవరపాటుకు గురిచేస్తోంది. పైగా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా అభిప్రాయపడుతున్నారు.

వైరస్‌ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి సమయం పడుతుండటంతో ఇకపై ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు తప్పనిసరిగా మూడుసార్లు పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఒకసారి చేసినప్పుడు వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ కాకపోయినా 28 రోజుల తర్వాత బయటపడే అవకాశం ఉందంటున్నారు. అందుకే క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి 14 రోజుల క్వారంటైన్ పీరియ‌డ్ స‌రిపోదని 28 రోజుల వరకు పెంచాలని లేదంటే పెను ముప్పు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories