Nayab Singh Saini: హ‌ర్యానా కొత్త సీఎంగా న‌యాబ్ సింగ్ సైనీ

Nayab Singh Saini To Replace Manohar Lal Khattar As Haryana Chief Minister
x

Nayab Singh Saini: హ‌ర్యానా కొత్త సీఎంగా న‌యాబ్ సింగ్ సైనీ

Highlights

Nayab Singh Saini: ప్రస్తుతం కురుక్షేత్ర ఎంపీగా ఉన్న సైనీ

Nayab Singh Saini: హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ప్రస్తుతం కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు సైనీ. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సీఎం పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో బీజేఎల్పీ సమావేశం నిర్వహించగా.. పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు నాయబ్‌ సైనీ వైపు అధిష్ఠానం మొగ్గుచూపింది.

ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో భాజపాలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణ్‌గఢ్‌ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఏకంగా 3.83లక్షల మెజార్టీతో విజయం సాధించారు.

గతేడాది అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హరియాణా ఓబీసీల్లో సైనీల జనాభా దాదాపు 8 శాతం ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు సీఎం పదవికి ఖట్టర్‌ రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్ర పక్షం జేజేపీతో విభేదాలు తలెత్తడం వల్ల ఆయన అధికార పీఠం నుంచి దిగిపోయారు. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖట్టర్‌ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కర్నాల్‌ ఎంపీ స్థానం నుంచి ఖట్టర్‌ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories