Modi in ladakh: లఢక్ లో మోదీ..సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే !

Modi in ladakh: లఢక్ లో మోదీ..సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే !
x
Highlights

Modi in ladakh: భారత ప్రధానమంత్రి మోదీ.. ఏ సమయంలో ఎక్కడికి వెళ్తారో.. ఏం చర్యలు తీసుకుంటారో ప్రభుత్వంలో ఉన్న వారి సహచరులకే తెలియదు అనే దానికి ఇదే నిదర్శనం.

Modi in ladakh: భారత ప్రధానమంత్రి మోదీ.. ఏ సమయంలో ఎక్కడికి వెళ్తారో.. ఏం చర్యలు తీసుకుంటారో ప్రభుత్వంలో ఉన్న వారి సహచరులకే తెలియదు అనే దానికి ఇదే నిదర్శనం. తాజాగా శుక్రవారం ఉదయం లఢక్ వెళ్లి అందరినీ ఆశ్యర్య పరిచారు. చైనాతో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారిగా లడక్‌లో ప్రత్యక్షమయ్యారు.

సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయనే స్వయంగా లడక్‌లో పర్యటిస్తున్నారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణేతో కలిసి ఆయన లడక్ వెళ్లారు. నీములో ప్రధానికి లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్ అన్ని వివరాలు తెలిపారు. భారత సైన్యం తరపున హరిందర్ సింగ్ చర్చలు జరుపుతున్నారు. జూన్ 15న చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను మోదీ పరామర్శించనున్నారు.

ఇటీవలే ఆర్మీ చీఫ్ నరవణే లడక్ వెళ్లారు. చైనా బలగాల దాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించారు. చైనా బలగాల దాడిని తిప్పికొట్టిన భారత జవాన్లకు ప్రశంసా పత్రాలు కూడా అందించారు. ఎల్‌ఏసీ వెంబడి విధులు నిర్వహిస్తున్న సైనికులతో నేరుగా మాట్లాడి వారిలో స్థైర్యం నింపారు.

మరోవైపు లడక్ వెళ్లాలనుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధాని మోడీ లడక్ పర్యటన మన సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో కూడా మోడీ ఉద్రిక్త సమయంలో పాక్ సరిహద్దుల్లో పర్యటించిన విషయం తెలిసిందే!


Show Full Article
Print Article
Next Story
More Stories