Chhattisgarh: మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి

Maoists Detonated Landmines Blast 11 people Died in Chhattisgarh
x

Chhattisgarh: మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. 11 మంది జవాన్లు మృతి

Highlights

Chhattisgarh: మృతుల్లో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్‌

Chhattisgarh: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. దంతేవాడ జిల్లా అరన్‌పూర్‌లో మావోయిప్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది జవాన్లు చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో 10 మంది డీఆర్‌ఎఫ్‌ పోలీసులు, డ్రైవర్‌ ఉన్నారు. పోలీసులు కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల దాడిలో పోలీసుల వాహనం ధ్వంసమయ్యింది.

గాయపడ్డ జవాన్లను చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. మందుపాతర పేల్చిన తరువాత మావోయిస్టులు కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనపై చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బాగేల్‌తో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. మావోయిస్టులపై పోరులో రాష్ట్రానికి పూర్తి సహకరం అందిస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనపై ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మృతిచెందిన వారిపట్ల తన ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories