Delisha Davis: పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్‌గా 24 ఏళ్ల యువతి

Kerala Trichur Girl Delisha Davis Drive Hazardous Goods Tanker
x

Delisha Davis Drive Hazardous Goods Tanker 

Highlights

Delisha Davis: కేరళలోని త్రిచూర్‌కి చెందిన 24 ఏళ్ల డెలిషా డేవిస్ పెట్రోల్ ట్యాంకర్ ను అలవోకగా నడిపిస్తోంది.

Delisha Davis: ఆడవాళ్లు అంటే ఆ పనే చేయాలి.. ఈ పనే చేయాలి అనే అడ్డమైన రూల్స్ పెట్టుకున్నాం. ఏదైనా పని మీద పంపాలంటే.. ఆడవాళ్లు వెళతామంటే.. వద్దు వద్దు... అంటూ మగవాళ్లను పంపుతారు. వారికి అవకాశం ఇచ్చి చేస్తే కదా.. వారు చేయగలరో లేదో తెలిసేది. ప్రపంచం మారింది.. సొసైటీ మారింది.. ఆలోచనలు మారాయి.. ఆడవాళ్లలో ధైర్యం, తెగువ పెరిగాయి. చదువు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అందుకే ఇప్పుడు ఏ పని చేయడానికైనా సై అంటూ ముందుకొస్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్ నడిపే 24 ఏళ్ల డెలిషా డెవిస్ ను చూస్తే.. ఆడవాళ్ల శక్తి సామర్ధ్యాల గురించి ఎవరైనా అభిప్రాయం మార్చుకోక తప్పదు.

కేరళలోని త్రిచూర్‌కి చెందిన 24 ఏళ్ల డెలిషా డేవిస్. జనరల్‌గా పెట్రోల్ ట్యాకర్లు, లారీల వంటి హెవీ వెహికిల్స్‌ ని మగవాళ్లు మాత్రమే డ్రైవ్ చేస్తారు. అలాంటిది... ఈ యువతి... ట్యాంకర్ డ్రైవర్ వృత్తిని ఎంచుకొని అలవోకగా పెట్రోల్ ట్యాంకర్ నడిపేస్తోంది. ప్రస్తుతం డెలిషా... కామర్స్‌ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. అందువల్ల త్వరలోనే ఆమెకు పెద్ద ఉద్యోగం, ఐదంకెల జీతం వచ్చే ఉద్యోగం లభించగలదు. కానీ డెలిషా మాత్రం పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్‌ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఒక్కసారి ట్యాంకర్ ఎక్కితే... డెలిషా డేవిస్... ఏకంగా 30 కిలోమీటర్లు నడిపేస్తుంది. ఏమాత్రం అలసిపోదు. ముఖంపై చిరునవ్వు చెరగదు. నిజానికి ఆమెకు ఈ డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. ఆమె తండ్రి పిఏ డేవిస్ లారీ డ్రైవర్. దాంతో... ఆ డ్రైవింగ్ చూసి... ఆమె కూడా డ్రైవర్ కావాలనుకుంది. ఆయన 42 ఏళ్లుగా ట్యాంకర్ నడుపుతున్నారు. డేవిస్ కూడా ఆమెను నిరాశపరచకుండా డ్రైవింగ్ నేర్పించారు. దాంతో... ఆమె.. ఆఫీషియల్‌గా డ్రైవింగ్ నేర్చుకొని... కొచ్చి నుంచి మళప్పురానికి వారానికి మూడుసార్లు ట్రిప్పులు వేస్తోంది. ఇరుంబనంలోని రిఫైనరీ నుంచి తిరూర్‌లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరును తీసుకెళ్తోంది. మూడేళ్లుగా ఇలా చేస్తోంది. అప్పుడప్పుడూ అధికారులు ఆర్టీ ఏ తనిఖీలు చేసినప్పుడు... ట్యాంకరు నడిపే ఆమెను చూసి ఆశ్చర్యపోతూ... శభాష్ అంటుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories