Karnataka drugs case : డ్రగ్స్ కేసులో బుల్లితెర నటుల విచారణ.. వీరే..

Karnataka drugs case :  డ్రగ్స్ కేసులో బుల్లితెర నటుల విచారణ.. వీరే..
x
Highlights

కర్ణాటక డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మ గంటు సీరియల్ నటి గీతా భారతి బట్, అలాగే యాంకర్ అభిషేక్,...

కర్ణాటక డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మ గంటు సీరియల్ నటి గీతా భారతి బట్, అలాగే యాంకర్ అభిషేక్, సినీ నటులు లూస్ మద యోగి, రష్మిక చెన్నప్ప క్రికెటర్ అయ్యప్ప బుల్లితెర ఉద్యోగి నిశ్చిత ను అధికారులు విచారించారు.. వీరితోపాటు సినీ నటుడు లూస్ మద యోగి ని రెండు గంటల పాటు విచారించిన isd అధికారులు అతని నుంచి సమాచారం సేకరించారు. యోగి పై అపార్ట్మెంట్ నివాసులు గిరినగర పోలీసులకు ఫిర్యాదు. రాత్రి వేళల్లో యోగి స్నేహితులు మత్తులో గొడవ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికే అరెస్టైన సినీ తారలు రాగిణి ద్వివేది, సంజన తో సన్నిహితంగా ఉంటున్న పారిశ్రామికవేత్త సతీష్ క్యాడ్ బోన్స్ ను ను కూడా అధికారులు విచారించారు. జైలుకు వెళ్లిన నిందితులతో అతను నిత్యం ఫోన్లో సంభాషణ జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చామరాజ పేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ శ్రీలంక పర్యటనలపై ముఖ్యమంత్రి యాడియురప్ప కు సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరిగి ఫిర్యాదు చేశారు. జమీర్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ప్రోటోకాల్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనకు వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. ఇదిలావుంటే మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న విదేశీయుడి తోపాటు ఐదుగురును హెన్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 5 లక్షల విలువచేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ ఉమర్, మరో నలుగురు అరెస్టు అయినవారిలో ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని తరలించి బెంగళూరు నగరంలో విక్రయించే ముఠాను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్టణానికి చెందిన నన్నారావు, భీమన్న అలాగే బెంగళూరుకు చెందిన షబ్బీర్ ఖాన్ ను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ 9.6 లక్షల విలువైన 30.32 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories