Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా పడనుందా.. ఇస్రో ప్లాన్ బి ఏంటి

ISRO Plans To Make Chandrayaan 3 Launch A Success
x

Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా పడనుందా.. ఇస్రో ప్లాన్ బి ఏంటి

Highlights

Chandrayaan 3: ఆగస్టు 27కు ల్యాండింగ్ తేదీ మారుస్తామన్న ఇస్రో శాస్త్రవేత్త

Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం చేసేందుకు ఇస్రో పక్కా ప్రణాళిక వేసింది. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అత్యంత కీలకలో ఉందని ఇస్రో తెలిపింది. దశ రాబోయే సమస్యలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది. ఇక రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై చివరినిమిషంలో కూలిపోయిన తరుణంలో ఇస్రో శాస్త్రవేత్త ఒకరు కీలక ప్రకటన చేశారు. ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించి ప్రతికూలతలు తలెత్తితే ల్యాండింగ్ తేదీని మారుస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్‌ను ఇస్రో ల్యాండింగ్‌ చేయనుంది.

‘ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగడానికి రెండు గంటల ముందు ఓసారి అన్ని అంశాలను పరిశీలిస్తాం. ల్యాండర్ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే దిగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని ఇస్రో తెలిపింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆగస్టు 24కు ల్యాండింగ్ తేదీని మారుస్తాం’’ అని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్‌-3 లింక్‌ అయింది. 25 నుంచి 30 కిలో మీటర్ల ఎత్తు నుంచి చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగనుంది. ప్రస్తుతం చంద్రుడిపై దిగేందుకు అనువైన పరిస్థితుల కోసం విక్రమ్ ల్యాండర్ వేచిచూస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories