రైతన్నలకు క్రీడాకారుల మద్దతు...

రైతన్నలకు క్రీడాకారుల మద్దతు...
x
Highlights

రైతులు పట్టు వీడలేదు. కేంద్రం మెట్టు దిగలేదు. నిన్న రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దాంతో అన్నదాతలు ఆందోళనను తీవ్రతరం చేశారు. కేంద్రం...

రైతులు పట్టు వీడలేదు. కేంద్రం మెట్టు దిగలేదు. నిన్న రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దాంతో అన్నదాతలు ఆందోళనను తీవ్రతరం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు ఏడు రోజులుగా ఢిల్లీ శివారులో నిరసనలు చేస్తున్నారు. కేంద్రం చర్చలు జరిపినా రైతులు మాత్రం నిరసనలు విరమించడం లేదు. దాంతో పరిస్థితి అంతకంతకూ జటిలమవుతోంది. అటు వైపు వచ్చే వాహన రాకపోకలకు వీల్లేకుండా పోయింది. అన్నదాతల ఆందోళనకు నానాటికీ మద్దతు పెరుగుతోంది.

మరోవైపు రైతులు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ఐదుగురితో ఒక కమిటీని నియమిస్తామని ప్రభుత్వం మరోసారి చేసిన ప్రతిపాదనను 35 రైతు సంఘాలు మూకుమ్మడిగా తిరస్కరించాయి. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకొవాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోళన చేపడుతున్నారు. గురువారం మరోసారి రైతు సంఘాల నేతలతో చర్చించనున్నారు.

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. రాజకీయ పార్టీలతో పాటు క్రీడాకారుల నుంచి కూడా మద్ధతు లభిస్తోంది. రైతుల ఆందోళనపై బలగాలను ప్రయోగించడాన్ని తప్పుబట్టిన పలువురు మాజీ క్రీడాకారులు వారికి మద్దతుగా నిలిచారు.

అంతేకాదు కేంద్రం అన్నదాతలపై దాడులు చేయడంపై క్రీడాకారులు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము అందుకున్న పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కర్తార్ సింగ్, బాస్కెట్ బాల్ క్రీడాకారులు సజ్జన్‌సింగ్, హాకీ క్రీడాకారుడు రజ్‌బీర్ కౌర్ తదితరులు ఈ నెల 5న రైతుల ఆందోళనలో పాల్గొని, రాష్ట్రపతి భవన్ బయట తమ పురస్కారాలను వదిలిపెట్టాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories