FAO ఇంటర్న్‌షిప్ అవకాశం.. రూ. 50 000 వేల స్కాలర్‌షిప్..!

fao internship get a chance to work with the united nations with a scholarship up to rs50 000
x

FAO ఇంటర్న్‌షిప్ అవకాశం.. రూ. 50 000 వేల స్కాలర్‌షిప్..!

Highlights

FAO ఇంటర్న్‌షిప్ అవకాశం.. రూ. 50 000 వేల స్కాలర్‌షిప్..!

FAO Internship: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2022 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తులు తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇందులో పాల్గొనవచ్చు.

ఈ ఇంటర్న్‌షిప్ యువతకి నేర్చుకునే సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ గొప్పదనం ఏంటంటే మీరు వేరే దేశానికి చెందినవారైతే TOEFL/IELTS వంటి భాషా పరీక్షను రాయనవసరం లేదు. ఇంటర్న్‌షిప్ వ్యవధి 3 నుంచి 11 నెలల మధ్య ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు వారానికి 35 నుంచి 40 గంటల మధ్య పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక ఇంటర్న్‌షిప్ పోర్టల్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు.

ఇంటర్న్ స్థానిక కరెన్సీలో స్టైపెండ్ అందుకుంటారు నెలకు 50000 వరకు చెల్లిస్తారు. ఈ మొత్తంతో అభ్యర్థులు ఖర్చులను సులభంగా నిర్వహించగలరు. సర్వీస్-కాస్ట్‌కి సంబంధించిన మెడికల్ కవరేజ్ కూడా అందిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా FAO సభ్యుల పౌరులు అయి ఉండాలి. తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అగ్రికల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, యానిమల్ సైన్సెస్, ఎకనామిక్స్, బిజినెస్, మేనేజ్‌మెంట్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, సోషల్ స్టడీస్ రంగాలలో ఇటీవల గ్రాడ్యుయేట్లు అయి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం ఒక FAO అధికారిక భాష (ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, చైనీస్ లేదా రష్యన్) పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్న్‌షిప్ అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 మధ్య ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories