Aerial Accidents: గగనతల ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు

Famous Celebrities Died in Aerial Accidents in India | Telugu Online News
x

Aerial Accidents: గగనతల ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు

Highlights

Aerial Accidents: ప్రముఖులు ప్రయాణిస్తున్న సమయంలో కుప్పకూలిన హెలికాఫ్టర్‌లు...

Aerial Accidents: హెలికాఫ్టర్ ప్రమాదాలు కొత్తేమీ కాదు. ఇప్పటివరకు చాలా ప్రమాదాలే జరిగాయి. ముఖ్యంగా ప్రముఖులు ప్రయాణిస్తున్న సమయంలోనూ అవి కుప్పకూలాయి. గగనతల ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు కూడా కన్నుమూశారు. అయితే వాటి భద్రతపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నవంబర్ 14, 1997 అరుణాచల్‌ప్రదేశ్‌ తవాంగ్ సమీపంలో అప్పటి కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి ఎన్వీఎస్ సోము హెలికఫ్టర్ ప్రమాదంలో మరణించారు. తర్వాత 2001లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అప్పటి కేబినెట్ మంత్రిగా చేస్తున్న మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటనలో నలుగురు మీడియా ప్రతినిధులు సహా ఏడుగురు మరణించారు.

2001న అరుణాచల్‌ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి డేరా నాతుంగ్ కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. అటు తరువాత 2002లో కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో బెల్-206 హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కుప్పకూలడంతో కన్నుమూశారు. ఇలా 2004లో సీని నటి సౌందర్య, మేఘాలయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సైప్రియన్ సంగ్మా, 2005లో హరియాణా వ్యవసాయ మంత్రి, జిందాల్ పారిశ్రామికవేత్త సురేంద్రసింగ్ జిందాల్ కూడా గగనతల ప్రమాదాల్లో మరణించారు.

ఇక సెప్టెంబర్ 02, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో మరో నలుగురు మృతిచెందారు. 20011లో అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు, సహా మరో నలుగురు గగనతల ప్రమాదంలో కన్నుమూశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories