అభినందన్ భార్య అంటూ ఫేక్ వీడియో వైరల్..

అభినందన్ భార్య అంటూ ఫేక్ వీడియో వైరల్..
x
Highlights

పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను భారత్‌కు తిరిగివచ్చారు. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్‌...

పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను భారత్‌కు తిరిగివచ్చారు. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్‌ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీకి అప్పగించారు. వాఘా బార్డర్‌లో ఐదుగురు ఐఏఎఫ్‌ అధికారులు అభినందన్‌ను రిసీవ్‌ చేసుకోగా.. అభినందన్ కుటుంబసభ్యులు ఆయన వెంట ఉన్నారు. ఇదిలావుంటే అభినందన్ భార్య పేరుతో గత రెండు రోజులుగా యూట్యూబ్ లో ఓ మహిళా వీడియో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఫేక్‌ అని తేలింది.

''నేను పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న అభినందన్‌ భార్యని. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులను రాజకీయ నాయకులు సొంతం లాభం కోసం వాడుకోకండి. సైనికుల త్యాగాలను రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకోకండి'' అంటూ 1.08 నిమిషాల పాటు సాగే వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఉన్నది హర్యానాకు చెందిన చెందిన శిరీష రావ్‌గా గుర్తించారు. బూమ్‌ ఏజన్సీ ఆమెను సంప్రదించగా.. ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది తానేని శిరీషరావ్‌ తెలిపారు. అయితే తనకు తెలియకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడియోను మార్ఫింగ్‌ చేశారనీ, తన భర్త ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి అని సదరు మహిళా పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories