Earth Hour 2024: 23న ‘ఎర్త్ అవర్’.. కచ్చితంగా ఈ పనులు చేయండి..!

Earth Hour on 23rd of this month know the things you should do without forgetting
x

Earth Hour 2024: 23న ‘ఎర్త్ అవర్’.. కచ్చితంగా ఈ పనులు చేయండి..!

Highlights

Earth Hour 2024: ప్రతి సంవత్సరం ప్రజలు ఎర్త్‌ అవర్‌ పాటిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 23 న ఎర్త్‌ అవర్‌ వచ్చింది.

Earth Hour 2024: ప్రతి సంవత్సరం ప్రజలు ఎర్త్‌ అవర్‌ పాటిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 23 న ఎర్త్‌ అవర్‌ వచ్చింది. ఈ రోజున రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆర్పివేసి మద్దతు తెలుపుతారు. వాతావరణ మార్పులు, పర్యావరణంపై అవగాహన కల్పించడానికి ఈ ఎర్త్‌ అవర్‌ అనే కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. దీనిని మొదటిసారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో పాటించారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) దీనిని ప్రారంభించింది.

పర్యావరణాన్ని, వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలని దీని ఉద్దేశ్యం. ఈ విషయం అందరికి చెప్పడానికి ఎర్త్‌ అవర్‌ నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రోజున గంటపాటు లైట్లు ఆర్పివేస్తారు. లక్షలాది మంది ప్రజలు, వేలాదిమంది వ్యాపారవేత్తలు ఇందులో భాగస్వాములవుతారు. ప్రస్తుతం ఎర్త్ అవర్‌లో 190 దేశాలు భాగస్వామ్యమయ్యాయి. అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాల వాడకం గంటపాటు ఆగిపోతుంది. ఈ చిన్న పని భూమిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది.

గంటపాటు లైట్లు ఆపేస్తే విద్యుత్‌ ఆదా అవుతుందని అందరికి తెలుసు. కానీ దీనివల్ల వాతావరణం, పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలనే ఒక సందేశం ప్రజల్లోకి వెళుతుంది. పర్యావరణంపై మనకున్న శ్రద్ధను ఇది బయటపెడుతుంది. భవిష్యత్ తరాల కోసం ఈ భూమిని కాపాడాలని సూచిస్తుంది. ఎర్త్ అవర్‌లో 23న రాత్రి 8.30 నుంచి గంటపాటు అంటే 9.30 వరకు అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories