Bangalore: ఆస్పత్రిలో పేషెంట్‌ బతికించేందుకు రోడ్డుపై పరుగులు తీసిన డాక్టర్‌

Doctor ran 3 km to Save the Patient in Bangalore
x

Bangalore: ఆస్పత్రిలో పేషెంట్‌ బతికించేందుకు రోడ్డుపై పరుగులు తీసిన డాక్టర్‌

Highlights

Bangalore: బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ ఇక్కట్లు, కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు

Bangalore: బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.. కిలోమీటర్ల వరకు నిలిచి పోతున్న వాహనాలతో గంటల కొద్దీ రోడ్లపైనే నిలిచిపోవాల్సి వస్తోంది. కొన్ని సార్లయితే ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది.. మరికొన్ని సార్లు కారు దిగి నడిచి పోవాల్సి వస్తోంది. ఒక డాక్టర్‌కు ఇటీవల సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. డాక్టర్‌ గోవింద్‌ సుకుమార్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌, ఆస్పత్రిలో పేషెంట్‌కు ఆపరేషన్‌ చేయాల్సి ఉంది.. భారీ వర్షం రావడంతో ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.. ఆస్పత్రికి ఇంకో 3కి.మీ. ఉందనగా ట్రాఫిక్‌లో కారు కదల లేదు.. చేసేదేమీ కారు దిగి పరుగందుకున్నారు డాక్టర్‌.. 45నిమిషాలు పరుగెత్తి ఆస్పత్రికి చేరుకున్నారు.. ఇప్పుడు డాక్టర్‌ పరుగెత్తే విజువల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories