Ayodhya: అయోధ్య రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్న భక్తులు

Devotees Waiting For Inauguration Of Ram Mandir Ayodhya
x

Ayodhya: అయోధ్య రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్న భక్తులు

Highlights

Ayodhya: నుమాయిష్‌లో ఈ కారును ప్రదర్శించనున్నట్లు తెలిపిన సుధాకర్

Ayodhya: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ నడుస్తుంది. అయోధ్య రామ జన్మ భూమిలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కోసం భక్తులు ఎదురు చేస్తున్నారు. ఈ మహత్తర ఘట్టంలో ప్రత్యక్షంగానో,పరోక్షంగానో భాగస్వామ్యం కావడానికి ఎందరో ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రామమందిర తలుపులు, పాదుకలను తయారీ చేసిన ఘనత నగరానికి దక్కింది. ఇక ఇప్పుడు నగరానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి అచ్చు అయోధ్య రామ మందిరాన్ని పోలిన డిజైన్ తో ఓ కారును సిద్దం చేశారు. రామమందిరాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేని వారి కోసం ఈ కారును సిద్దం చేసినట్లు సుధాకర్ తెలిపారు . మందిరాన్ని పోలి ఉండే వాహనం 20 ఫీట్ల పొడవు, 26 ఫీట్ల ఎత్తులో ఉంటుందని. రెండు రోజుల్లో సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని సుధాకర్ వెల్లడించారు.. నుమాయిష్ లో ఈ కారును ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories