Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Delhi Court Extends Manish Sisodias Judicial Custody till April 18
x

Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Highlights

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి ఆప్ నేత మనీష్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది.

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి ఆప్ నేత మనీష్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఏప్రిల్ 18 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయిం తీసుకుంది. ఇవాళ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సిసోడియాను పోలీసులు హాజరపర్చారు. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈనెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు.

మద్యం కుంభకోణంలో తన ప్రమేయాన్ని కేంద్ర ఏజెన్సీలు ఇంకా రుజువు చేయలేదని సిసోడియా పేర్కొన్నారు. మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిబ్రవరి 26, 2023 న లిక్కర్ స్కామ్‌లో అరెస్టు చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అరెస్టు చేసింది. ఇక ఫిబ్రవరి 28, 2023న ఢిల్లీ కేబినెట్‌ నుంచి సిసోడియా తప్పుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది నుంచి సోసిడియా జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ లభించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories