Atishi Marlena: జైలు నుంచే పాలన ప్రారంభించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Delhi CM Kejriwal Started Ruling From Jail
x

Atishi Marlena: జైలు నుంచే పాలన ప్రారంభించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Highlights

Atishi Marlena: ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన ఏపని ఆగదు

Atishi Marlena: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాలన ఎలా సాగిస్తారనే అంశంపై గందరగోళం నెలకొన్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైలు నుంచే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర మంత్రి అతిశీ మార్లీనా తెలిపారు. ఢిల్లీలో నీటి సమస్యపై జలమంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అతిశీ మార్లీనాకు ఆయన ఓ లేఖ పంపారు. ఓ పక్క జైల్లో ఉన్నా... ఢిల్లీ ప్రజల సమస్యల గురించి కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారని అతిశీ మార్లీనా చెప్పారు. ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన ఏ పని ఆగదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories