Coronavirus Ends by December in India: ఇండియా ఔట్ బ్రేక్ శుభవార్త! డిసెంబర్ 3 నాటికి కరోనా వైరస్ కట్టడి సాధ్యమే!!

Coronavirus Ends by December in India: ఇండియా ఔట్ బ్రేక్ శుభవార్త! డిసెంబర్ 3 నాటికి కరోనా వైరస్ కట్టడి సాధ్యమే!!
x

Coronavirus ends by December in india

Highlights

Coronavirus Ends by December in India: కరోనా మహమ్మారి తిరోగమన బాట పట్టే రోజు దగ్గరలోనే ఉందని ఇండియా ఔట్ బ్రేక్ శుభవార్త చెప్పింది. రోజురోజుకీ దేశంలో కరోనావైరాస్ బారిన పడినవారి సంఖ్య పెరిగిపోతోంది.

Coronavirus Ends by December in India: కరోనా మహమ్మారి తిరోగమన బాట పట్టే రోజు దగ్గరలోనే ఉందని ఇండియా ఔట్ బ్రేక్ శుభవార్త చెప్పింది. రోజురోజుకీ దేశంలో కరోనావైరాస్ బారిన పడినవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే 29 లక్షల మంది దీని బారిన పడ్డారు. ఇది ఎప్పటికి వాడులుతోందో తెలీక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇటువంటి సందర్భంలో డిసెంబర్ 3 వ తేదీనాటికి కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని ఐఓఆర్ ప్రజలకు ఉపశమనం కలిగించే విషయాన్ని తన నివేదికలో చెప్పింది.

ఈ నివేదిక అంచనాల ప్రకారం..

సెప్టెంబర్ నెల మొదటి వారాంతానికి కరోనా కేసులు గరిష్ట స్థాయిని చేరుకుంటాయి. అటు తరువాత వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. సెప్టెంబర్ తోలి రెండు వారాలు చాలా కీలకమనీ, ఆ పదిహేను రోజుల్లో కరోనా మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని నివేదిక చెబుతోంది. అయితే, అటు తరువాత 15 రోజుల్లో హాట్ స్పాట్స్ తో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఐఓఆర్ అంచనా.

ఇటీవల ఢిల్లీ లో నిర్వహించిన సేరలాజికల్ సర్వ్ లో అక్కడ 58 లక్షల మందిలో కరోనా యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని గుర్తించారు. దీంతో వైరస్ ను ఎదుర్కునే శక్తి భారతీయుల్లో పెరుగుతుందనే అంచనాలు వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం నవంబర్ నాటికి ముంబయి కరోనా నుంచి బయట పడవచ్చని, అక్టోబర్ చివరి నుంచి చెన్నైలో వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఈ తాజా నివేదిక వివరించింది.

ఆగస్టు నెలాఖరుకు బెంగళూరులో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని, ఆపై నవంబరు రెండో వారం తరువాత తగ్గుముఖం పడతాయని పేర్కొంది. మహా నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ, పట్టణాలు, గ్రామాల్లో పెరుగుతున్నందున, ఇకపై మధ్య, చిన్న శ్రేణి పట్టణాలపై ప్రభుత్వాలు దృష్టిని సారించాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories