PF Customers: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్...

Central Govt Hikes Maximum Sum Assured Payable Under Edli Scheme
x

 PF Customers:(File Image) 

Highlights

PF Customers: ఈడీఎల్‌ఐ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అందించే బీమా మొత్తాన్నికేంద్ర ప్రభుత్వం పెంచేసింది.

PF Customers: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గతంలోనే ఆ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా దానిని అమలులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అదేంటంటే.. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద అందించే భీమా మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఇకపై పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద రూ.7 లక్షల వరకు భీమా వర్తిస్తుంది. అంటే.. కేంద్ర ప్రభుత్వం.. ఈడీఎల్‌ఐ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అందించే బీమా మొత్తాన్ని పెంచేసింది. ఈ నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం కింద రూ.6 లక్షల భీమా కవరేజ్ లభించేది.

2020 సెప్టెంబర్ 9న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కు ఈపీఎఫ్ఓ కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సీబీటీ ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ భీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటివరకు అమలులోకి రాలేదు. తాజాగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ భీమా కవరేజ్ మొత్తాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చిందని తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసిందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories