సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పిన సీఈసి

సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పిన సీఈసి
x
Highlights

దేశంలో సార్వత్రిక ఎన్నికలపై నిర్వహణపై రోజుకో వార్త పుట్టుకొస్తుండడంతో ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి సునీల్‌ ఆరోరా దీనిపై స్పందించారు. దేశంలో నిర్ణీత...

దేశంలో సార్వత్రిక ఎన్నికలపై నిర్వహణపై రోజుకో వార్త పుట్టుకొస్తుండడంతో ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి సునీల్‌ ఆరోరా దీనిపై స్పందించారు. దేశంలో నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని సునీల్‌ ఆరోరా స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న దశలో ఎన్నికలు వాయిదా పడతాయా? అన్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. కాగా తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, అభ్యర్థులు స్వదేశంలో ఉన్న తమ ఆస్తుల వివరాలతో పాటు విదేశాలలో ఉన్న ఆస్తులను సైతం వెల్లడించాల్సి ఉంటుందన్నారు. దీన్ని ఐటీ విభాగం నిజ నిర్ధారణలు సమీక్షించి ఏమైనా తేడా ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి 1,63,331 పోలింగ్‌ స్టేషన్లలో వీవీప్యాట్‌ యంత్రాలను ఉపయోగిస్తామన్నారు సునీల్‌ ఆరోరా.

Show Full Article
Print Article
Next Story
More Stories