ఢిల్లీలో భారీ పెలుడు.. కార్లు ధ్వంసం

ఢిల్లీలో భారీ పెలుడు.. కార్లు ధ్వంసం
x

ప్రతీకాత్మక చిత్రం

Highlights

దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల కలకలం రేగింది.

దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల కలకలం రేగింది. బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కు కేవలం కిలోమీటర్ దగ్గరలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో బ్లాస్టింగ్ జరిగింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు.. అగ్రిమాపక సిబ్బందితో సహా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరోవైపు.. ఈ పేలుళ్ల ధాటికి పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది. అయితే.. ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది..? బ్లాస్టింగ్‌కు గల కారణాలపై ఇంకా క్లారిటీ రాలేదు. బ్లాస్ట్ వెనుక ఉగ్ర కుట్ర ఏదైనా ఉందా అన్న సందేహం కలుగుతోంది. ఇప్పటివరకూ అయితే ఎవరూ గాయాల పాలైనట్లు సమాచారం లేదు. ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయాని కేవలం 50 మీటర్ల దూరంలో జరిగిన ఈ బ్లాస్ట్‌లో.. పూల కుండీలో బాంబ్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు.

ఇక.. ఈ బ్లాంస్ట్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కాసేపటి క్రితం గుర్తు తెలియని అగంతకులు కొందరు పోలీసులకు ఫోస్ చేసి పేలుడు జరుగుతుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పేలుడుకి ఐఈడీ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సెన్సేషన్ క్రియేట్ చేయడానికే ఆకతాయిలు ఈ ఘటనకు పాల్పడినట్లుగా ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories