Bharat Rice: నేటి నుంచి మార్కెట్‌లోకి 'భారత్‌ రైస్‌'

Bharat Rice In The Market From Today
x

Bharat Rice: నేటి నుంచి మార్కెట్‌లోకి 'భారత్‌ రైస్‌'

Highlights

Bharat Rice: ఢిల్లీలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌

Bharat Rice: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ రైస్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచే దేశవ్యాప్తంగా భారత్‌ రైస్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్రం. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం భారత్ రైస్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. 29 రూపాయలకే కేజీ బియ్యం అందిస్తోంది.

రిటైల్ మార్కెట్లో తొలి దశలో భారత ఆహార సంస్థ నుంచి సేకరించిన 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్ర నిర్ణయించింది. నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో విక్రయించనుంది.

త్వరలోనే ఇ- కామర్స్ ప్లాట్ ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్ లోకి అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా వెల్లడించారు. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో భారత్ రైస్ విక్రయాలు జరగనున్నాయి. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి, భారత్‌ శనగపప్పు విక్రయాలకు ఈ-కామర్స్‌ వేదికల్లో మంచి స్పందన వస్తుండగా.. భారత్‌ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories