Tamil Nadu: తప్పి పోయిన పిల్ల ఏనుగు.. సేఫ్​గా తల్లి వద్దకు చేర్చిన అటవీసిబ్బంది

Baby Elephant Reunited with Mother in Tamil Nadu by Forest Team
x

Tamil Nadu: తప్పి పోయిన పిల్ల ఏనుగు.. సేఫ్​గా తల్లి వద్దకు చేర్చిన అటవీసిబ్బంది

Highlights

Tamil Nadu: డ్రోన్లు, అటవీ సిబ్బంది సాయంతో వెతికిన సిబ్బంది

Tamil Nadu: ఈ సృష్టిలో అత్యంత మధురమైనది అమ్మ ప్రేమ. ఆ ప్రేమను ఇంకెవరూ భర్తీ చేయలేరు. ఆ అనురాగాన్ని ఇంకెవరూ ఇవ్వలేరూ. కేవలం మనుషులు మాత్రమే కాదు.. పశువుల్లో కూడా అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది. అయితే ఓ ఏనుగు తన బిడ్డ కోసం చూపించిన ప్రేమ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే తప్పిపోయిన ఆ బిడ్డను తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీశాఖ చేసిన ప్రయత్నమే ఇప్పుడు అందరి చేత శభాష్ అనిపిస్తున్నది. తాజాగా, తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

తమిళనాడు పొల్లాచ్చికి సమీపంలోని అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో పిల్ల ఏనుగు తప్పిపోయింది. డిసెంబర్ 30 న 4-5 నెలల వయసున్న అడవి ఏనుగు తల్లి ఏనుగు నుంచి తప్పిపోయింది. మంద నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు ఎటు వెళ్లాలో తెలీని పరిస్థితిలో తిరుగుతూ ఫారెస్ట్ సిబ్బంది కంటపడింది. పిల్ల ఏనుగును ఎలాగైనా తల్లి ఏనుగు వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో వారు తీవ్రంగా శ్రమించారు. పిల్ల ఏనుగును ట్రక్కులోకి ఎక్కించి.. వాగులు, వంకలు దాటించారు. అప్పటికీ తల్లి జాడ దొరకలేదు. చివరకు డ్రోన్ల సాయంతో 3 కిలోమీటర్ల దూరంలోని ఏనుగుల మందను గుర్తించారు. చివరకు ఎట్టకేలకు పిల్ల ఏనుగును తల్లి వద్దకు చేర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories